1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
  4. Healthy food prawn palak salad

హెల్దీ ఫుడ్ : రొయ్యలు, పాలకూర సలాడ్!

Healthy food prawn palak salad
రొయ్యలు, పాలకూరలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా ఎముకలకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. దంత సమస్యలను, మధుమేహ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కావలసిన పదార్థాలు :
ఉడికించిన రొయ్యలు: రెండు కప్పులు 
తురిమిన నిమ్మకాయ: ఒక టీ స్పూన్ 
తాజా నిమ్మరసం: అరకప్పు 
చిన్న ముక్కలుగా కత్తిరించిన డిల్: నాలుగు స్పూన్లు 
వర్జిన్ ఆలివ్ నూనె: అర కప్పు 
పాలకూర: నాలుగు కప్పులు 
తరిగిన రాడిష్ : రెండు కప్పులు 
పైన్ గింజలు:  రెండు స్పూన్లు 
కోషర్ ఉప్పు, మిరియాలు
 
తయారీ విధానం:  
ముందుగా ఓ పెద్ద బౌల్ తీసుకుని అందులో నిమ్మ తురుము, నిమ్మరసం, డిల్ ముక్కలు వేయాలి. తర్వాత ఆలివ్ నూనె వేయాలి. ఇందులో రొయ్యలు, పాలకూర, ముక్కలుగా చేసిన రాడిష్ పైన్ గింజలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉప్పు మరియు మిరియాలు వేసి సర్వ్ చేయాలి. అంతే సలాడ్ రెడీ.
About Writer
Selvi