1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Andhra Pradesh : More deaths registered in Kurnool and Krishna

కర్నూలు - కృష్ణా జిల్లాల్లో కరోనా మరణ మృదంగం

Andhra Pradesh
గంటల్లో ఏకంగా 12 మంది మృత్యువాతపడ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది. 
 
ఇక, కొత్తగా 813 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిలో 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, మరో 8 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. మొత్తంగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 13,098కి పెరిగింది. 
 
తాజాగా 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,908 కాగా, మరో 7,021 మంది చికిత్స పొందుతున్నారు. 
 
జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో 1371, చిత్తూరులో 891, ఈస్ట్ గోదావరిలో 1002, గుంటూరులో 1193, కడపలో 794, కృష్ణలో 1331, కర్నూలులో 1787, నెల్లూరులో 579, ప్రకాశంలో 313, శ్రీకాకుళంలో 62, విశాఖపట్టణంలో 145, వెస్ట్ గోదావరిలో 875 చొప్పున మొత్తం 10848 కేసులు నమోదయ్యాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చైనా విద్యుత్ పరికరాల్లో మాల్వేర్... కేంద్ర మంత్రి హెచ్చరిక