సంబంధిత వార్తలు
- శ్రీ సిటీలో ఏపీఎస్ఎస్డీసీతో అల్‌స్టామ్ భాగస్వామ్యం: ఆంధ్రప్రదేశ్‌లో యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు
- చిన్నారుల కోసం.. గూగుల్ ప్లే స్టోర్‌లోని మూడు యాప్‌ల తొలగింపు
- కపిల్ దేవ్‌కు గుండె నొప్పి కాదు.. ఛాతినొప్పి..!?
- అలాంటి కిక్‌లో సీయం జగన్: నారా లోకేశ్ ఫైర్
- రాథేశ్యామ్ స్టోరీ ఇదే, ప్రభాస్ అభిమానులకు పండగే..!
ఏపీ కరోనా బులెటిన్, 75 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
గత కొద్ది రోజులుగా ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజా గడిచిన 24 గంటల్లో 74,919 కరోనా టెస్టులు చేయగా 3,342 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,04,026కి చేరింది. అయితే ఇందులో 31,469 యాక్టివ్ కేసులుండగా 7,65,991 మంది కరోనా నుండి కోలుకున్నారు.
ఒక్క రోజే 6,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6,556కి చేరింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు.
అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా కడప, ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అటు జిల్లాల పరంగా కేసులను పరిశీలించగా అనంతపురం 131, చిత్తూరు 404, ఈస్ట్ గోదావరి 445, గుంటూరు 378, కడప 203, కృష్ణా 344, కర్నూలు 60, నెల్లూరు 98, కాశం 266, శ్రీకాకుళం 112, విశాఖపట్నం 244, విజయనగరం 106, వెస్ట్ గోదావరి 551 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు ఏపీలో 75,02,993 కరోనా టెస్టులు నిర్వహించారు.
తర్వాతి కథనం
