గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 24 అక్టోబరు 2020 (19:13 IST)

శ్రీ సిటీలో ఏపీఎస్‌ఎస్‌డీసీతో అల్‌స్టామ్‌ భాగస్వామ్యం: ఆంధ్రప్రదేశ్‌లో యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్‌ యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా, అల్‌స్టామ్‌ ఇప్పుడు మొదటి బ్యాచ్‌ యువ డిప్లమో ఇంజినీర్ల కోసం శిక్షణా కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కిల్‌ ఏపీ కార్యక్రమం క్రింద ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది డిప్లమో ఇంజినీర్లకు శిక్షణ ఇచ్చి వారిని పరిశ్రమకు సిద్ధంగా ఉన్నట్లుగా శ్రీసిటీలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ శిక్షణా కేంద్రం వద్ద మలువనుంది.
 
అల్‌స్టామ్‌ కోసం ప్రత్యేకంగా పైలెట్‌ బ్యాచ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ అనంతరాము, ఐఏఎస్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, నైపుణ్యాభివృద్ధి కేంద్ర శాఖ; శ్రీ కెవీ చక్రధర్‌ బాబు, ఐఏఎస్‌, కలెక్టర్‌ మరియు జిల్లా మెజిస్ట్రేట్‌, నెల్లూరు జిల్లా ; శ్రీ చల్లా మధుసూదన్‌ రెడ్డి, ఛైర్మన్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీ ; శ్రీ అర్జా శ్రీకాంత్‌, ఐఆర్‌టీఎస్‌ , ఎండీ అండ్‌ సీఈవో, ఏపీఎస్‌ఎస్‌డీసీ మరియు శ్రీ విజయ్‌ సుబ్రమణియన్‌, సైట్‌ ఎమ్‌డీ- అల్‌స్టామ్‌ శ్రీ సిటీ పాల్గొన్నారు. అల్‌స్టామ్‌ యొక్క శ్రీ సిటీ సదుపాయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం సందర్శించడంతో పాటుగా ఫ్యాక్టరీ కార్యక్రమాలను గురించి తెలుసుకుని,  శిక్షణా కార్యక్రమాలను గురించి మరింతగా అర్థం చేసుకున్నారు.
 
‘‘ఆసియా-ఫసిఫిక్‌ ప్రాంతంలో అల్‌స్టామ్‌కు సంబంధించి అత్యాధునికమైన రోలింగ్‌ స్టాక్‌ తయారీ కేంద్రం శ్రీ సిటీ ఫ్యాక్టరీ. ఇక్కడ అత్యాధునిక మెట్రో ట్రైన్‌ సెట్స్‌ను భారతీయ మరియు అంతర్జాతీయ వినియోగదారుల కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రయత్నాలను అభినందిస్తున్నాము. ఈ యువ ఆలోచనాపరులను మా బోర్డ్‌పైకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాం’’ అని అలెయిన్‌ స్పోర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా, అల్‌స్టామ్‌ అన్నారు.
 
దాదాపు 45రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమంలో సాంకేతిక  నైపుణ్యాలు, ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత (ఈహెచ్‌ఎస్‌), నాణ్యత ఫండ్‌మెంటల్స్‌, రైల్వే భద్రతతో పాటుగా ఆల్‌స్టామ్‌ యొక్క కార్యక్రమాల పరిచయం వంటి అంశాలపై తరగతి శిక్షణ సైతం అందించనున్నారు. అదనంగా, ట్రైనీలు పలు సెషన్స్‌ను టైమ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్‌పర్సనల్- కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలలో పాల్గొనడంతో పాటుగా ఏపీపీఎస్‌డీ ట్రైనర్ల వద్ద శిక్షణ పొందుతారు.

దీనిని అనుసరించి ఒక నెల పాటు ఆన్‌ ద షాప్‌ ఫ్లోర్‌ పైన ఉద్యోగ శిక్షణ పొందుతారు. అనంతరం, పాల్గొన్న అభ్యర్ధులను వారి ప్రతిభ ఆధారంగా పరిశీలించి సంక్షిప్తీకరించిన జాబితాలో అర్హత కలిగిన వ్యక్తులకు అల్‌స్టామ్‌ ఉపాధి అవకాశాలను అందిస్తుంది. మార్చి 2021 నాటికి ఈ కార్యక్రమం ద్వారా మరో 50 మంది డిప్లమో ఇంజినీర్లతో కలిసి పనిచేసేందుకు కంపెనీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది.