గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (19:44 IST)

తగ్గని కరోనా కొత్త కేసులు... మరణాలు మాత్రం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పతాక స్థాయికి చేరుకున్న తర్వాత, ఇటీవల ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16 కరోనా మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,524కి పెరిగింది.
 
తాజాగా 76,726 నమూనాలు పరీక్షించగా 3,620 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 631, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 66 కేసులు గుర్తించారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలో 3,723 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 7,96,919 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,58,138 మంది వైరస్ నుంచి విముక్తులయ్యారు. ఇంకా, 32,257 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాల వారీగా యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే, 
 
అనంతపురం 1777, చిత్తూరు 3746, ఈస్ట్ గోదావరి 5935, గుంటూరు 3704, కడప 2042, కృష్ణ 3096, కర్నూలు 748, నెల్లూరు 575, ప్రకాశం 2785, శ్రీకాకుళం 1200, విశాఖపట్టణం 2172, విజయనగరం 852, వెస్ట్ గోదావరి 3625 చొప్పున ఉన్నాయి.