ఆంధ్రప్రదేశ్‌లో కరోనా: 24 గంటల్లో 3746 కేసులు.. 27మంది మృతి

corona virus
corona virus
సెల్వి| Last Updated: బుధవారం, 21 అక్టోబరు 2020 (19:37 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3746 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,93,299 కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 27మంది ప్రాణాలు కోల్పోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6508కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,396 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 754415 లక్షలకు చేరింది. ఇక మంగళవారం ఒక్క రోజే ఏపీలో 74,422 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 72,71,050 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 301, చిత్తూరులో 437, తూర్పు గోదావరిలో 677, గుంటూరులో 396, కడపలో 166, కృష్ణాజిల్లాలో 503, కర్నూల్ లో 65, నెల్లూరులో 116, ప్రకాశం జిల్లాలో 127, శ్రీకాకుళంఓ 167, విశాఖపట్నంలో 138, విజయనగరంలో 134, పశ్చిమ గోదావరి జిల్లాలో 519 కేసులు నమోదయ్యాయి.దీనిపై మరింత చదవండి :