దసరా సెలవు.. సోమవారం మహిళా ఉద్యోగులకు హాలిడే

Andhra pradesh
Andhra pradesh
సెల్వి| Last Updated: శనివారం, 24 అక్టోబరు 2020 (09:54 IST)
దసరా సెలవు ఈ సారి గందరగోళంగా మారిపోయింది. ముందు అంతా ఆదివారం (25వ తేదీ)నే దసరా సెలవుగా నిర్ణయించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈనెల 26న దసరా సెలవును ఇస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, కేంద్ర ప్రభుత్వం సోమవారం 26వ తేదీన ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఈ నెల 26న ఆపన్షల్‌ హాలిడేగా ప్రకటించింది సర్కార్. పండుగ ఆదివారం కావడంతో సెలవును సోమవారానికి మార్చాలని ఉద్యోగుల విజ్ఞప్తులు రావడంతో.. ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు 26న సెలవు వర్తిస్తుందని పేర్కొంటూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.దీనిపై మరింత చదవండి :