శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 24 అక్టోబరు 2020 (15:12 IST)

అలాంటి కిక్‌లో సీయం జగన్: నారా లోకేశ్ ఫైర్

విశాఖలో గీతం యూనివర్శిటీ కట్టడాలను కూల్చివేయడంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు బందోబస్తు నడుమ జేసీబీ, బుల్డోజర్లతో వాటిని కూల్చివేసిన ఘటనకు సంబంధించిన పోటోలు ఆయన పోస్ట్ చేశారు. కూల్చివేతలకు వైఎస్ జగన్ ఆనందానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు.
 
సామాన్యంగా సీఎం స్థానంలో ఉన్నవారికి రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసేటప్పుడు కొత్త కిక్ వస్తుంది. కానీ వైఎస్ జగన్‌కు కట్టడాలను కూల్చివేయడంపై కిక్ వస్తున్నది. సుదీర్ఘ చరిత్ర కలిగిన గీతం యూనివర్శిటీని కూల్చివేయడంపై జగన్ రాజకీయ కక్ష ఉందని తెలిపారు. 
 
కరోనా కష్టాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సేవలు అందించిన ఆసుపత్రి ఎన్నో ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి ఎంతోమందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్శిటీపై విధ్వంసం సృష్టించడం చాలా దారుణమని తెలిపారు. కనీసం నోటీసులు జారీ చేయకుండా ఇలాంటి విధ్వంసానికి పాల్పడడం దారుణమని తెలిపారు. జగన్‌కు పడగొట్టడం తప్ప నిలబెట్టడం తెలియదని మండిపడ్డారు.