నాగార్జునను బిట్టూ అని పిలవడంవల్లే అలా జరిగిందా? సుజాత ఏమంటోంది?
బిగ్ బాస్ షోకి సంబంధించి ప్రస్తుతం జోర్దార్ సుజాత హాట్ టాపిక్‌గా మారింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సుజాత గురించి ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఉన్నట్లుండి ఎలిమినేట్ చేయడానికి ఒకటే కారణంగా అందరూ భావించారు. కానీ ఆ తరువాత సుజాత చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.
నేను నాగార్జునను బిట్టూ అని పిలిచాను. నేను అలా పిలిచిన సమయంలో నాగ్ ముఖం చూశాను. చాలా సంతోషంగా ఉంది. కానీ హౌస్ లోని వారు కొంతమంది దానిపై అభ్యంతరం చెప్పారు. అంతేకాదు బయట కూడా ఆ పేరు గురించి పెద్ద చర్చే జరిగింది. నాకు పొగరు అని కూడా చాలామంది ప్రచారం చేశారు.
నన్ను నాగార్జున అభిమానులు తిట్టుకున్నారు కూడా. కానీ బిట్టూ అని పిలవమని చెప్పింది నిర్వాహకులే. అలా పిలిస్తే నాగార్జునకు ఇష్టమని వారే చెప్పారు. నేను అలానే పిలిచాను. కానీ అలా పిలవడం వల్ల నన్ను ఎలిమినేట్ చేసేశారని మరింత ప్రచారం చేసేస్తున్నారు.
దీన్ని మానండి.. బిగ్ బాస్‌లో ఎలిమినేట్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేనే కంటెన్టెంట్‌ను కాబట్టి నాకు బాగా తెలుసు. ఇందులో ఒకరిని ఎక్కువగా.. ఒకరిని తక్కువగా చూపించరు. ఎవరు ఏవిధంగా హౌస్‌లో ఉంటారో దాన్ని బట్టే మార్కులు వేస్తారని జోర్థార్ సుజాత చెబుతున్నారు. మొత్తం మీద సుజాత ఎలిమినేట్ కావడం మాత్రం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.