సంబంధిత వార్తలు
- పద్మనాభ స్వామి ఆలయం మూసివేత... ఎందుకో తెలుసా?
- కోవిడ్‌ను ఓడించిన ట్రంప్... వైద్య చికిత్స పూర్తయిందట... వైద్యుల ప్రకటన
- తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్.. తెలంగాణలో 1,500 మార్కుకు చేరిన మృతుల సంఖ్య
- అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలొద్దు.. జూనియర్ ఎన్టీఆర్ (video)
- ముఖ పరిచయంలేని వ్యక్తుల చేతుల్లో మోసపోవద్దు : హీరో ఎన్టీఆర్
కరోనా వైరస్‌ని మంత్రాలతో పారద్రోలవచ్చా..?
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19ను మంత్రాలతో పారద్రోలుతానంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం... సిరిసిల్ల పట్టణానికి చెందిన కంచర్ల కనకయ్య అనే వ్యక్తి తాయత్తులు, మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
నిందితుడు జిల్లా ప్రజలనే కాకుండా వేరే జిల్లాల నుంచి వచ్చే వారిని కూడా మంత్రాలు, తాయత్తులతో కరోనాను నయం చేస్తానని చెప్పి ధనార్జనకు పాల్పడుతున్నాడని సీఐ రవికుమార్ తెలిపారు. అతని దగ్గరి నుంచి ఉంగరాలు, రంగు రాళ్లు, మూలికలు మొదలగునవి స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని చెప్పారు.
తర్వాతి కథనం
