శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (11:02 IST)

ముఖ పరిచయంలేని వ్యక్తుల చేతుల్లో మోసపోవద్దు : హీరో ఎన్టీఆర్

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ళ చేతుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎన్నో రకాలైన అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఫలితంగా డిజిట‌ల్ యుగంలో సైబ‌ర్ నేర‌గాళ్ళ ఆకృత్యాలు అంత‌కంత పెరుగుతూ పోతున్నాయి.
 
ముఖ్యంగా, ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ మోసాల‌తో వీరు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నారు. ప్రధానంగా అమ్మాయిలు సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డి మోస‌పోతున్నారు. అమ్మాయిల ద‌గ్గ‌ర నుండి వ్య‌క్తిగ‌త స‌మాచారం సేక‌రించి వారిని బెదిరించ‌డం, డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో అమ్మాయిలు ఎంతో మాన‌సికవేద‌న‌కు లోనుకావ‌డ‌మేకాక కొన్ని సంద‌ర్భాల‌లో ఆత్మ‌హ‌త్య కూడా చేసుకుంటున్నారు
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు తాజాగా సైబ‌ర్ మోసాల‌కు సంబంధించి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌తో ఓ వీడియోని రూపొందించి విడుదల చేశారు. ఇందులో సోషల్ మీడియా ద్వారా ప‌రిచ‌య‌మైన వ్య‌క్తి ద్వారా మ‌హిళ ఎంత మాన‌సిక క్షోభ అనుభ‌విస్తుందో క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. చివ‌రలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇలాంటి మోసాల‌లో చిక్కుకోకుండా ఉండేందుకు యువ‌త త‌గినన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.   
 
'వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త!' అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.