సంబంధిత వార్తలు
- పండుగ సీజన్ వేళ డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించిన అమెజాన్ ఇండియా
- ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు
- ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజులు బాదుడు, కరోనా వచ్చినా ఇంట్లోంచి కదలని తెలంగాణ పేషెంట్లు
- 108 అంబులెన్సును తగులబెట్టిన రౌడీ షీటర్
- పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన వాల్ మార్ట్, డ్రోన్ల ద్వారా సరకులు పంపిణీ
కరోనా వైరస్ సోకిన గర్భిణీకి పురుడు పోసిన ఆంబులెన్స్ సిబ్బంది
కరోనా వైరస్ సోకిన ఓ గర్భిణీకి 108 ఆంబులెన్స్ సిబ్బంది పురుడు పోసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శుక్రవారం జరిగింది. పట్టణంలో న్యూ అర్బన్ కాలనీకి చెందిన అనూష.. నిండు గర్భిణీగా ఉన్నప్పుడు కరోనా వైరస్ సోకింది.
శుక్రవారం అనూషకు నొప్పులు రాగా బంధువులు వైద్యులను సంప్రదిస్తే.. హైదరాబాద్ తరలించమన్నారు. ఈ మేరకు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా సిబ్బంది చేరుకుని ఆమెకు వాహనంలో పురుడు పోయగా మగబిడ్డకు జన్మనిచ్చింది.
అంబులెన్స్ టెక్నీషియన్ స్వాతి ఆమెకు ప్రాథమికంగా చికిత్స అందించి.. అనంతరం వేములవాడ ఆరోగ్య కేంద్రానికి తరలించగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తొలిసారి అయినా.. కాన్పును సక్రమంగా నిర్వహించిన 108 టెక్నీషియన్ స్వాతి, పైలెట్ బాలకృష్ణను స్థానికులు అభినందించారు.
