శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 10 సెప్టెంబరు 2020 (15:36 IST)

పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన వాల్ మార్ట్, డ్రోన్ల ద్వారా సరకులు పంపిణీ

ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ కీలక అడుగు వేసింది. ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా నిత్యావసర సరకులను ఇళ్లకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో బెంటర్ విల్లేలో తొలుత పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. డెలివరీ సంస్థ ప్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల ద్వారా వినియోగదారులకు నిన్నటి నుంచి సరకులు సరఫరా చేయడాన్ని ప్రారం భించింది.
 
ఈ సందర్భంగా వాల్ మార్ట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. రానున్న రోజులలో మిలియన్ ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయాలని చూస్తామని తెలిపింది. ప్రస్తుతం అనేక సంస్థలకు డ్రోన్ల ద్వారా సరకులను సరఫరా చేస్తున్నామని తెలిపింది.
 
డ్రోన్ల ద్వారా సరఫరా చేయడం వల్ల సరకులు త్వరగా వినియోగదారులకు చేరుతుందని దీనివల్ల సమయం ఆదా రెట్టింపు, ఎక్కువ మోతాదులో ప్యాకేజీలను డెలివరీ చేయవచ్చునని ఆ సంస్థ తెలిపింది. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్లా ఉంటుందని తెలిపింది.