గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (11:16 IST)

కరోనా సోకిందనీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య.. ఎక్కడ?

కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఈ వైరస్ సోకిందన్న భయం అనేక మంది ప్రాణాలను తీస్తోంది. చదువుకున్న వాళ్లు కూడా ఈ వైరస్‌కు భయపడి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒకరు కరోనా వైరస్ సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గంగిరెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఇటీవల కరోనా లక్షణాలు బయపడటంతో పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.
 
దీంతో ఆయన్ను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే, చికిత్సా సమయంలో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్ళపల్లి అనే ప్రాంతంలో రైలులో నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు