ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (10:23 IST)

తెలంగాణలో కరోనా విజృంభణ.. కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ మృతి

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అనేక మంది ప్రజాప్రతినిధులకు కరోనా కాటేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 356 మంది చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కరోనాతో మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబసభ్యులు, అనుచరులు తీవ్ర విచారంలో ఉన్నారు.
 
తెలంగాణాలోని జూరాలకు ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకింది. దీంతో యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు.
 
ఇటీవ‌ల గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో కూడా న‌రేంద‌ర్ పాల్గొన్నారు. దీంతో న‌రేంద‌ర్ ఎవ‌రెవ‌రితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. కాగా న‌రేంద‌ర్ మృతికి ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు సంతాపం వ్య‌క్తం చేశారు. కాగా తెలంగాణలో ఆదివారం 1,269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో సోమవారం ఎనిమిద మంది చనిపోయారు.