తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ.. కాంగ్రెస్ నేత నరేంద్ర యాదవ్ మృతి
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 356మంది ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కరోనాతో మరణించారు. ఆయన మృతితో కుటుంబీకులు, అనుచరులు, ఆప్తులు, బంధువులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకింది. దీంతో యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
కాగా.. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అన్ని కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. దీంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ నేతలందరూ.. కరోనా పరీక్షలు చేయించుకునే పనిలో పడ్డారు.