గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 11 జులై 2020 (18:00 IST)

నేను సేఫ్.. ఆందోళన వద్దు - ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా

కరోనాకు ప్రముఖులు కూడా భయపడిపోతున్నారు. ప్రజాప్రతినిధులను కరోనా తాకుతున్న పరిస్థితుల్లో వారంతా అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రముఖల దగ్గర పనిచేసే వారికి ముందుగా కరోనావైరస్ సోకింది. వారి ద్వారా కాంటాక్ట్ పద్థతిన కరోనా వస్తోంది. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
 
దీంతో రోజాకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై రోజా స్పందించారు. తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని.. ఎవరూ ఆందోళనకు గురికావద్దని చెప్పారు. తాను ఇంట్లో చాలా సేఫ్‌గా ఉన్నానని.. వైసిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావద్దంటున్నారు రోజా. 
 
తన వ్యక్తిగత గన్‌మెన్‌ను తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం అతనికి ఆ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని.. కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలని కూడా రోజా కోరుతోంది. అలాగే ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మేనల్లుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో నారాయణస్వామి కూడా హోం ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు.