గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జులై 2020 (11:02 IST)

భారతదేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. డిసెంబర్‌కు మారటోరియం

భారత దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల్ని వాయిదా వేసేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మారటోరియం గడువు ఆగస్టులో ముగుస్తుంది. మొదటి విడతలో మార్చి నుంచి మే వరకు, రెండో విడతలో జూన్ నుంచి ఆగస్ట్ వరకు మారటోరియం ప్రకటించింది. 
 
కానీ కరోనా వైరస్ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. భారతదేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అందుకే మారటోరియం డిసెంబర్ వరకు పొడిగించాలన్న వాదన తెరపైకి వచ్చింది. మారటోరియంను మరో మూడు నెలలు అంటే నవంబర్ వరకు లేదా డిసెంబర్ వరకు పొడిగించాలని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నారు. 
 
మారటోరియం పొడిగించకపోతే ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చెల్లించకపోతే ఎన్‌పీఏలు పెరగొచ్చని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో ఎన్‌పీఏలు పెరిగితే బ్యాంకులకు భారం తప్పదని, అందుకే మారటోరియం పొడిగించాలని అంటున్నారు.