గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 జూన్ 2020 (20:55 IST)

BigBreaking, టిక్ టాక్‌తో సహా 59 యాప్స్‌పై భారత్ నిషేధం

బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇండియన్ డిజిటల్ ప్రపంచంలో విస్తరించి వున్న 59 చైనా యాప్స్ పైన నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయించింది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంట చైనాతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, భారత ప్రభుత్వం సోమవారం ఇలాంటి చర్య తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం 59 చైనా యాప్‌లను నిషేధించాలని నిర్ణయించింది.
చైనా ప్రొడక్ట్స్ అయిన 59 మొబైల్ అనువర్తనాల జాబితాలో టిక్‌టాక్, షేర్‌ఇట్, యుఎస్ బ్రౌజర్, బైడు మ్యాప్, హెలో తదితర మొబైల్ యాప్స్ వున్నాయి.