ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (11:55 IST)

5జీ ఎకోసిస్టమ్ టెక్నాలజీ వచ్చేస్తుందిగా.. 2జీనే వినియోగిస్తే ఎలా?

దేశవ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా  మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. త్వరలోనే దేశ ప్రజలకు 5జీ ఎకోసిస్టమ్‌ టెక్నాలజీని అందుబాటులో ఉంచనున్నట్లు రిలయన్స్‌ జియో వార్షిక నివేదికలో ప్రకటించింది.
 
ఈ విషయమై షేర్‌ హోల్డర్‌ల సమావేశంలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ స్పందిస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు జియో ఎప్పుడు కృషి చేస్తుందని, కానీ ఇప్పటికి లక్షలా మంది వినియోగదారులు 2జీ సేవలనే వినియోగిస్తున్నారని తెలిపారు. కాగా 2జీ సేవల వినియోగదారులను 4జీ సేవలను ఉపయోగించే విధంగా రిలయన్స్ సంస్థ కృషి చేసిందన్నారు. 
 
అయితే గత రెండు సంవత్సరాలలో 10కోట్ల మందిని 2జీ నుంచి 4జీ సేవలవైపు ఆకర్షించడంలో జియో కీలక పాత్ర పోషిందని పేర్కొన్నారు మరోవైపు రిలయన్స్ అద్భుత విజయాలతో ప్రపంచ దిగ్గజ కంపెనీ (ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌)లు తమ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.