శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (17:47 IST)

డిస్నీ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వనున్న జియో!

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు డిస్నీ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వనుంది. లాక్ డౌన్‌లో వున్న కారణంగా వినియోగదారులకు ఈ సబ్‌స్క్రిప్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని... జియో భావిస్తోంది. ఇందులో భాగంగా డిస్నీం హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఏడాదిపాటు ఇవ్వనుంది. త్వరలోనే ఈ ఆఫర్ ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది. 
 
ప్రస్తుతం భారత్‌లో డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి డిస్నీ హాట్‌స్టార్ వీఐపీ. ఇలా బండిల్ స్ట్రీమింగ్ సర్వీసెస్‌ని ఉచితంగా అందించడం జియోకు కొత్తేమీ కాదు. ఇప్పటికే జియో సినిమా యాప్‌లో డిస్నీ కంటెంట్ చూడొచ్చు.
 
ఈ నేపథ్యంలో డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ఎవరెవరికి లభించనుందో అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఏడాది డిస్నీం హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వబోతున్నట్టు మాత్రమే ప్రస్తుతానికి జియో ప్రకటించింది. ఈ ఆఫర్ త్వరలో జియో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. మరి ఈ ఆఫర్ ప్రీపెయిడ్ యూజర్లకా లేక పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.