మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (13:12 IST)

కలిసివచ్చిన కష్టకాలం .. జియోలోకి పెట్టుబడుల వెల్లువ (video)

కరోనా కష్టకాలం రిలయన్స్ జియోకు బాగా కలిసివచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. తాజాగా కేకేఆర్ సంస్థ జియోలో ఏకంగా రూ.11,367 కోట్లను పెట్టుబడిగా పెట్టి 2.32 శాతం షేర్లను కొనుగోలు చేయనుంది. ఆసియాలో ఇది అతిపెద్ద పెట్టుబడికానుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది. 
 
నిజానికి కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రం కొంతమేరకు నష్టాలను చవిచూస్తున్నాయి. అయితే, ఇవేమీ పెద్దగా పట్టించుకోని పలు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు రిలయన్స్ జియోలే భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు అమితాసక్తిని చూపుతున్నాయి. 
 
ఇందులోభాగంగా, జియో ప్లాట్‌ఫామ్స్‌లో కేకేఆర్ గ్రూపు ఏకంగా 11,367 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ విషయాన్ని ఆర్ఐఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఈ లావాదేవీ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లు కాగా, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ.5.16 లక్షల కోట్లని ఆర్ఐఎల్ తెలిపింది. ఈ పెట్టుబడితో జియోలోని 2.32 శాతం వాట్ కేకేఆర్ సొంతంకానుది. 
 
కాగా, టెక్నాలజీ దిగ్గజాలైన  ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్‌ల పెట్టుబడి ద్వారా జియో రూ.78,562 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంమీద కరోనా కష్టకాలం రిలయన్స్ జియోకు బాగా కలిసివచ్చినట్టుగా తెలుస్తోంది.