శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (16:34 IST)

జియో నుంచి కొత్త క్వార్టర్లీ ప్లాన్.. రూ.999లతో రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం కొత్త కొత్త ప్లాన్లతో కస్టమర్లను సంపాదించుకుంటోంది. గత వారం జియో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట కొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తన వినియోగదారులకు హై స్పీడ్ డేటాను అధిక మొత్తంలో అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా నిర్ణయించారు. 
 
ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా అందిస్తోంది జియో.. దీని కోసం రూ.2,399తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వార్షిక ప్లాన్‌ను రీచార్జ్‌ చేసుకుంటే.. వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. రోజుకు 2 జీబీ డేటా లభించనుంది. అంటే మొత్తంగా 730 జీబీ డేటాను పొందవచ్చు.
 
అంతే కాదు.. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ వెసులుబాటు ఉండగా.. ఇతర జియోయేతర నెట్‌వర్క్‌కు అయితే.. 12,000 నిమిషాలను అందిస్తోంది. ఇక, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీగా పొందవచ్చు. 
 
అలాగే కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్‌డౌన్, వర్క్‌ ఫ్రమ్ హోం కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. రూ.999 ప్రీపెయిడ్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను అందించనుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులు. 84 రోజుల వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు. 
 
అంతేగాకుండా.. ఈ క్వార్టర్లీ ప్లాన్ ద్వారా జియో వినియోగదారులకు ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ వంటి అదనపు లాభాలు రూ.999 ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ఇతర నెట్ వర్క్‌లకు 3,000 నిమిషాలు ఉచితంగా అందిస్తోంది.
 
అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ 3 జీబీ అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పరిమితమైపోతుంది. రూ.599, రూ.555 రీఛార్జ్‌ ప్లాన్లను జియో ఇప్పటికే వినియోగదారులకు జియో అందిస్తోంది. కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ కింద జియో యాప్‌లు జియో సినిమా, జియో సావన్‌ తదితర ప్రయోజనాలను అందిస్తోంది.