గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తోంది. గాలిలో వైరస్ తిరిగితే... మహమ్మారి బారి నుంచి ప్రజలను ఎలా రక్షించాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అయ్యా! గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోంది అని పరిశోధకులు ఏడాదిగా మొత్తుకుంటున్న విషయాన్ని... ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు, ఆరోగ్య అధికారులు ఇప్పుడు ధ్రువీకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా దీన్ని అంగీకరించింది....