మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : శనివారం, 15 మే 2021 (11:01 IST)

కుటుంబ సభ్యులకు తన వల్ల కరోనా వస్తుందేమోనని చెట్టెక్కి యువకుడు నివాసం

నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇంట్లోవారికి తన వల్ల కరోనా వస్తది ఏమో అన్న భయంతో.. చిన్న ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో.. ఇంటి ముందు చెట్టు మీద నివాసం ఏర్పరుచుకున్నాడు రామవత్ శివ అనే యువకుడు.

కుటుంబ సభ్యులు నలుగురు ఇంట్లోనే ఉంటుండగా.. శివ మాత్రం ఇంటి ముందు చెట్టు పైన మంచం  కట్టి అక్కడే గత తొమ్మిది రోజులుగా నివాసం ఉంటున్నాడు. తాగునీరు, భోజనం కింది నుంచి పంపిస్తారు. ఇంట్లో ఒకటే రూమ్ కావడంతో.. వసతి లేక ఇలా ఉంటున్నట్టు కరోనా బాధితుడు చెబుతున్నాడు.