బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 17 మే 2021 (12:30 IST)

Airtel Free pack, 5.5 కోట్ల మందికి రూ.49 రీఛార్జ్‌ ఉచితం

న్యూదిల్లీ: కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ నెట్‌ వర్క్‌ను వినియోగించే అల్ప ఆదాయవర్గాలైన 5.5 కోట్ల మందికి రూ.49 రీఛార్జ్‌ను ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమవంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు, రూ.79తో రీఛార్జ్‌తో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది. తాజా నిర్ణయం విలువ రూ.270 కోట్లని ఎయిర్‌టెల్‌ తెలిపింది.
 
‘‘55 మిలియన్ల ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు రూ.49 ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించాలని అనుకున్నాం. దీని ద్వారా రూ.38 టాక్‌టైమ్‌తో పాటు, 100 ఎంబీ ఉచిత డేటాను 28 రోజుల పాటు వినియోగించుకోవచ్చు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు ఎక్కువగా లబ్ధి పొందుతారు’’ అని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ రెండు ప్రయోజనాలు వారం రోజుల్లో  ప్రీపెయిడ్‌ వినియోగదారులకు అందుతాయని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌కు 34కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు