1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus live updates: India reports 9,121 new cases

భారత్‌లో కరోనా కేసులు... పెరుగుతున్నాయ్

Coronavirus
భారత్‌లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 11,805 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు చేరింది.
 
గడచిన 24 గంటల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,33,025 మంది కోలుకున్నారు. 1,36,872 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 87,20,822 మందికి వ్యాక్సిన్ వేశారు.
తర్వాతి కథనం
భార్యపై అనుమానం.. కుమార్తె కళ్లముందే.. భార్యను కత్తితో పొడిచి చంపేశారు..