శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (22:21 IST)

పెద్దలతో పోల్చితే, 20ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి..?

పెద్దలతో పోల్చితే, 20ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇంతకుముందు పరిశోధనల్లో పెద్దలకు, చిన్నారులకు కరోనా లక్షణాల్లో ఉండే వ్యత్యాసాలను గుర్తించారు. ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 
 
ఇటీవల పీఎల్వోఎస్‌ కంప్యుటేషనల్‌ బయాలజీ జర్నల్‌లోఈ పరిశోధన ప్రచురితమైంది. సెరో సర్వే ఆధారంగా ఒక వ్యక్తిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని గుర్తిస్తారు. ఇందులో 20 ఏళ్లకన్నా తక్కువ వయసున్న వారికి కరోనా సోకే అవకాశాలు 43శాతం తక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. 
 
అంతే కాకుండా వారు పెద్దవారితో పోలిస్తే 63శాతం తక్కువగా వైరస్‌ను వ్యాప్తి చేస్తారని వెల్లడించారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో కూడా చిన్నారులు, యువతకు ఎక్కువగా కరోనా నెగెటివ్‌ వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు.