సంబంధిత వార్తలు
- పెద్దలతో పోల్చితే, 20ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి..?
- ఆపదలో వున్నవారికి ఆపద్భాంధవుడు.. సోనూసూద్ కొత్త స్కీమ్!
- కరోనా వ్యాక్సిన్ పేరిట మత్తు ఇంజెక్షన్.. బంగారు నగల్ని దోచేసిన నర్సు.. ఎక్కడ?
- గుజరాత్ ముఖ్యమంత్రి కరోనా పాజిటివ్.. అందుకే సొమ్మసిల్లి పడిపోయారా?
- మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. 24 గంటల్లో 4వేల పాజిటివ్ కేసులు
భారత్‌లో మళ్లీ లాక్ డౌన్.. కారణం ఏమిటంటే?
భారత్‌లో మళ్లీ లాక్ డౌన్ పడే సూచనలున్నాయి. గత ఐదు రోజులుగా భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దాంతో అక్కడి చెంబూరును కవర్ చేసే ఎం వెస్ట్ వార్డులో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆ వార్డులో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో వార్డ్ ఆఫీస్... సోమవారం కొన్ని కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. అ
అంతేకాదు... అక్కడి ప్రజలంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. అధికారులు ఏమంటున్నారంటే... లాక్‌డౌన్ అని చెప్పకపోయినా... దాదాపు అలాంటి పరిస్థితులే అక్కడ అమలుచేస్తున్నట్లు చెప్పారు.
ప్రధానంగా కేసులు పెరగడానికి ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటమే కారణం అంటున్నారు అధికారులు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడి ప్రజలు మాస్కులు వాడట్లేదు. శానిటైజర్లను వాడటం ఎప్పుడో మానేశారు. ఇక సేఫ్ డిస్టాన్స్ అనేది మాటలకే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)పై ఒత్తిడి పెరుగుతోంది.
కరోనాను ఆ వార్డులో కంట్రోల్ చెయ్యకపోతే... అధి మళ్లీ ముంబై అంతటా విస్తరిస్తే... లేని పోని సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి మహారాష్ట్రలోనే కాదు... దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఓవైపు లక్షల మందికి రోజూ వ్యాక్సిన్లు వేస్తున్నా... ఇలా యాక్టివ్ కేసులు 4 వేల దాకా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో దేశంలో లాక్డౌన్ పడే అవకాశాలున్నాయని టాక్ వస్తోంది.
