సంబంధిత వార్తలు
- కరోనా లాక్డౌన్ కేసులన్నీ ఉపసంహరణ.. సీఎం యోగి నిర్ణయం
- అరెస్టు భయంతో మెట్టుదిగిన ట్విట్టర్ : 97 శాతం ఖాతాల బ్లాక్
- ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన కేంద్రం... ప్రతినిధులు అరెస్టు తప్పదా?
- Work From Home పెద్ద గుదిబండ: 90 శాతం మంది ఉద్యోగులకి అలాంటి ఇబ్బంది
- 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడే అమ్మాయిలు జాగ్రత్త.. బట్టలు విప్పమంటూ..?
ఆపదలో వున్నవారికి ఆపద్భాంధవుడు.. సోనూసూద్ కొత్త స్కీమ్!
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సోనూ సూద్ ప్రస్తుతం ఆపదలో వున్నవారికి ఆపద్భాంధవుడిగా నిలిచాడు. లాక్ డౌన్‌లో ఆయన ఎంత మందిని ఆదుకున్నారో.. ఎంత మందికి సహాయం చేశారో అందరం చూస్తూనే ఉన్నాం. లాక్ డౌన్‌లో మాత్రమే కాకుండా ఆయన ఇప్పటికీ కూడా అవసరమైన వారికి సాయం చేస్తూనే వస్తున్నారు. సోనూ సూద్ ఇప్పుడు కొత్తగా స్కీమ్ తీసుకువస్తున్నారు.
నిరుద్యోగ యువతకు దీని వల్ల చాలా బెనిఫిట్ కలుగనుంది. మీ వద్ద డబ్బులు లేకపోయినాసరే మీరు మీ సొంత బిజినెస్‌ను స్టార్ట్ చేయొచ్చు. మీరు యజమానిగా మారొచ్చు. ఇది ఎలా? అని ఆలోచిస్తున్నారా? అయితే సోనూ సూద్ చేసిన ట్వీట్ చదవాల్సిందే.
సోనూ సూద్ ట్విట్టర్‌లో ఒక ఫోట్ షేర్ చేశారు. దీనికి సిద్ధంగా ఉండండి అనే ఒక క్యాప్షన్ పెట్టారు. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో అంటే ఇన్వెస్ట్‌మెంట్ లేకుండానే సొంతంగా వ్యాపారం చేయొచ్చు. ఈ స్కీమ్ ద్వారా గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సోనూ సూద్ ముందుకు వెళ్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా అనేకమంది ప్రజలు ప్రయోజనం పొందే అవకాశం వుందని టాక్ వస్తోంది.
తర్వాతి కథనం
