1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus Positive Cases Rises To 348 In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కరోనా - కొత్తగా 19 పాజిటివ్ కేసులు

Coronavirus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 348కు చేరాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. 
 
ఈ ప్రకటన మేరకు.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఈ 19 కేసులు వెల్లడైనట్టు పేర్కొంది. ఇందులో గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశఁలో 3, వెస్ట్ గోదావరిలో ఒక కేసు నమోదైంది. అలాగే, ముగ్గుర కరోనా బాధితులు చికిత్స ముగించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, 
 
అనంతపురం 13, చిత్తూరు 20, ఈస్ట్ గోదావరి 11, గుంటూరు 49, కడప 28, కృష్ణ 35, కర్నూలు 75, నెల్లూరు 48, ప్రకాశం 27, విశాఖపట్టణం 20, వెస్ట్ గోదావరి 22 చొప్పున నమోదు కాగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భార్య ముందే పనిమనిషితో రొమాన్స్, వీడియో తీసిన భార్య ఏం చేసిందంటే?