అమెరికా తర్వాత స్పెయిన్‌లో విజృంభిస్తోన్న కరోనా.. 14,500 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత యూరప్ దేశాల్లోనే కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా స్పెయిన్‌లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది.
వరుసగా రెండో రోజు కోవిడ్-19 మరణాల సంఖ్య పెరిగింది. స్పెయిన్‌లో 24 గంటల్లో 757 మంది చనిపోయారు. ఫలితంగా దేశ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,500కు చేరిందని ఆదేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి స్పానిష్ ప్రభుత్వం మార్చి 14న ఐరోపాలో లాక్ డౌన్ విధించింది. ప్రజలు తమ ఇంటి నుండి పని చేయడానికి, ఆహారం కొనడానికి, వైద్య సంరక్షణ కోసం మాత్రమే ఈ లాక్ డౌన్‌లో అనుమతి ఇచ్చారు.
మహమ్మారిపై పోరుకు ఇంటెన్సివ్ కేర్ పడకలు, పరికరాలను సిద్ధం చేసింది. ఇటీవలి రోజుల్లో ఆసుపత్రులు పరిస్థితి మెరుగుపడింది. అయినా కరోనా మృతుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. కరోనా నియంత్రణకు స్పానిష్ సర్కారు తగిన చర్యలు తీసుకుంటూనే వుందని వైద్య అధికారులు తెలిపారు.