శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (14:46 IST)

అత్యంత ప్రమాద కరోనా వైరస్ ప్రభావిత దేశాలు ఏవి?

ప్రపంచాన్ని కరోనా వరస్ వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య వేలల్లో వుంది. వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య లక్షలకు చేరిపోయింది. పైగా, ఈ మహమ్మారి 202 దేశాలకు వ్యాపించింది. ఈ దేశాల్లో అత్యంత ప్రభావిత టాప్ 10 దేశాల జాబితాను ఓసారి పరిశీలిస్తే, 
 
తాజా గణాంకాల మేరకు ఈ జాబితాలో అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, ఇరాన్, బ్రిటన్, టర్కీ, స్విట్జర్లాండ్ దేశాలు వరుసగా ఉన్నాయి. కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఆ దేశం టాప్ టెన్‌లో ఆరో దశంగా ఉంది. 
 
అమెరికాలో ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య నాలుగు లక్షలు దాటిపోగా, మృతుల సంఖ్య దాదాపుగా 13 వేల వరకు ఉన్నాయి. అలాగే, స్పెయిన్‌లో మరణాలు 14 వేలు కాగా, ఇటలీలో 17 వేల మంది ఉన్నారు. చైనాలో మాత్రం మరణాల సంఖ్య కేవలం 3 వేలుగా మాత్రమే ఉంది.