కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ కోవిడ్-19.. ఎలా సాధ్యం?
దక్షిణ కొరియాలో కరోనా నుంచి కోలుకున్న 51మందికి మళ్లీ కోవిడ్-19 పాజిటివ్ నమోదైంది. ఇదేలా సాధ్యమని వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ కొరియాలో కరోనా నుంచి కోలుకున్న 51 మందికి కరోనా మళ్లీ సోకింది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియా డాయుగు నగరంలో కరోనా కారణంగా 51 మంది ఐసోలేషన్ నుంచి నెగటివ్ అని తేలడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇంటికి వెళ్లిన ఆ 51మందిని ఇంట్లోనే చికిత్స అందించారు. అయితే 51 మందికి జరిపిన పరిశోధనలో కరోనా పాజిటివ్ వున్నట్లు తేలింది. దీంతో మళ్లీ ఆ 51మందిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. దీనిపై దక్షిణ కొరియా వైద్యులు షాకవుతున్నారు. ఇదెలా సాధ్యమని యోచిస్తున్నార.
మానవశరీరంలోని వేలాది కణాల్లో ఎక్కడైనా కరోనా అంటుకుని వున్నా.. ఇలా జరిగేందుకు అవకాశం వుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కరోనా నుంచి కోలుకున్న వారిని కూడా కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో వుంచాల్సిన అవసరం వుందని వైద్యులు చెప్తున్నారు.
కానీ ఆంగ్లో వర్శిటీ ప్రొఫెసర్ హంట్ మాట్లాడుతూ.. కరోనా పరిశోధన సరిగ్గా జరగకుండానే ఆ 51మందిని డిశ్చార్జ్ చేసివుంటారన్నారు. ఎందుకంటే కరోనా సోకిన వారికి నెగటివ్ అని తేలేవరకు ఐసోలేషన్‌లో వుంచి డిశ్చార్జ్ చేసిన పిమ్మట కరోనా సోకేందుకు ఛాన్స్ లేనేలేదన్నారు. కాగా దీనిపై వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు.