1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Covid 19, 75760 coronavirus positive cases registered in India just 24 hours

భారత్‌లో కరోనావైరస్, ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు

Covid 19
భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. దేశంలో కేసుల సంఖ్య 33 లక్షల 10 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75,760 కేసులు నమోదు కాగా 1023 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 56,013 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. దేశంలో మొత్తం 33,10,234 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 7,25,991 ఉండగా 25,23,771 మంది కేలుకొని డిశ్చార్జ్ య్యారు. ఇదిలా ఉండగా 60,472 మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.24 శాతంగా ఉండగా, దేశంలో నమోదైన మొత్తం కేసులలో 1.83 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.93 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,24,998 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,85,76,510కి చేరింది.
తర్వాతి కథనం
అనుమానిస్తోందనీ భార్య పీక నులిమి చంపేసిన భర్త!