మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (08:27 IST)

ఏం జరిగిందో... 63 యేళ్ల వయసులో కన్నతల్లిని భార్యను చంపేసిన అథ్లెట్

అమెరికాలో దారుణం జరిగింది. కన్నతల్లి, భార్య హత్య కేసులో ఓ భారతీయ మాజీ అథ్లెట్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈయన వయసు 63 యేళ్ళు. ఈ వయసులో కన్నతల్లిని, భార్యను కడతేర్చాడు. ఈ వార్త విన్న ఆయన స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. పైగా, ఈ నిందితుడు గతంలో పంజాబ్ పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టరుగా కూడా పని చేశాడు. అలాగే టాటా స్టీల్ కంపెనీలు ఉన్నత ఉద్యోగం చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 1983లో కువైట్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఈ షాట్‌పుట్‌ ఆటగాడు ఇక్బాల్ సింగ్ బొపరాయ. ఈయన భారత తరపున అథ్లెట్ క్రీడల్లో పాల్గొని అనేక పతకాలను నెగ్గాడు. 
 
అయితే, ఈయన తన కన్నతల్లి, భార్యను హత్య చేశాడు. అదీ కూడా 63 ఏళ్ల వయసులో. ఈ వయసులో రక్తసంబంధీకుల్నే హత్య చేయడం అతని సన్నిహితుల్ని నిర్ఘాంతపరిచింది. ఈ హత్యానేరంపై అమెరికా, పెన్సిల్వేనియాలోని న్యూటౌన్‌ స్క్వేర్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 
 
ఈయన 1980 దశకంలో మేటి షాట్‌పుట్‌ ఆటగాడిగా రాణించిన ఇక్బాల్‌ టాటా స్టీల్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత పంజాబ్‌ రాష్ట్ర పోలీస్‌ శాఖలోనూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినట్లు అతని సన్నిహిత మిత్రుడు ఒకరు తెలిపారు.