Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?
Husband kills Tamil Nadu councillor
తమిళనాడు, తిరువళ్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే భర్త నరికి చంపేశాడు. ఈ ఘటన తిరువళ్లూరు, తిరునిండ్రవూర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... తిరువళ్లూరు జిల్లా , తిరునిండ్రవూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎస్ గోమతి కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం గోమతికి స్టీఫెన్ రాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
ఈ జంటకు పెళ్లి కాగా వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే గోమతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు తరచుగా గొడవలు జరుగుతూ వుండేవి.
గోమతి ఇటీవల ఆ వ్యక్తిని కలిసిందని.. ఆమె భర్తకు తెలిసింది. దీంతో గోమతి భార్య స్టీఫెన్ రాజ్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ వివాదం కాస్త ముదరడంతో భర్త స్టీఫెన్ ఆమెను నడి రోడ్డుపై కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.