ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 26 ఆగస్టు 2020 (16:45 IST)

అందుబాటు ధరలలో జివా మాడ్యులర్‌ స్విచ్‌లను ఆవిష్కరించిన పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా

దేశంలో అతిపెద్ద  విద్యుత్‌ నిర్మాణ సామాగ్రి (ఎలక్ట్రికల్‌ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌- ఈసీఎం) తయారీ సంస్థలలో ఒకటైన పానాసోసిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా, తమ ‘జివా’  శుభారంభం చేస్తున్నట్లు వెల్లడించింది. నూతన మరియు నిర్వచించతగిన జీవనశైలికి మారాలని కోరుకుంటున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఆకర్షణీయమైన, అందుబాటు ధరలలోని మాడ్యులర్‌ స్విచ్‌లు- జివా. ఈ శ్రేణి పరిచయంతో ఈ బ్రాండ్‌ తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటుగా ఈ విభాగంలో మరింతగా మార్కెట్‌ కైవసం చేసుకోవడమూ వీలవుతుంది. అత్యాధునిక మరియు ఆకర్షణీయమైన స్విచ్‌లను అందుబాటు ధరలో సొంతం చేసుకోవాలని వెదికే వినియోగదారుల కోసం ఈ విభాగంలో ఓ విప్లవాత్మక ఆవిష్కరణగా జివా నిలువనుంది.
 
తమ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోకు ప్రతిష్టాత్మక జోడింపుగా, అత్యాధునిక సాంకేతికత, గరిష్ట పనితీరు, సున్నితమైన డిజైన్‌ సమ్మేళనంగా జివా ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటూనే అత్యున్నత శ్రేణిలో ఉండాలంటున్న నేటి వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యతలకు తగిన రీతిలో ఈ సిరీస్‌ ఉంటుంది. పానాసోసిక్‌ లైఫ్‌ సొల్యూషన్‌ ఇండియా యొక్క జివా ను దేశీయంగా అభివృద్ధి చేయడంతో పాటుగా రూపకల్పన చేశారు. ఇది ఆకర్షణీయమైన మరియు వైవిధ్యమైన శ్రేణిని అందిస్తుంది. వీటిలో స్విచ్‌లు, సాకెట్లు, యాక్ససరీలు (ఫ్యాన్‌ రెగ్యులేటర్లు), టెలిఫోన్‌ సాకెట్లు, రిసిప్టర్లు, టీవీ సాకెట్లు మరియు యుఎస్‌బీ చార్జర్లు ఉంటాయి. ఈ శ్రేణి అపూర్వమైన ఫీచర్లు అయినటువంటి పలుచటి మరియు సన్నటి డిజైన్స్‌, అత్యుత్తమ శ్రేణి భద్రతాఫీచర్లు తో పాటుగా సుదీర్ఘకాలపు నిర్వహణ జీవితం కలిగి ఉంటాయి. ఇవి గృహ వాతావరణపు సౌందర్యం వృద్ధి చేయడం మాత్రమే కాదు, స్వాభావికంగా అత్యుత్తమ మన్నిక కలిగి ఉంటాయి. అందువల్ల, అందుబాటు ధరలలోని గృహాల విభాగంలో  ఏకీకృత పరిష్కారంగా ఇది నిలుస్తుంది.
 
ఈ సందర్భంగా శ్రీ వివేక్‌ శర్మ, మేనేజింగ్‌ డైరెక్టర్‌, పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘ సంపూర్ణమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను నిర్మించాలనే మా ప్రయత్నాలలో  ప్రతిష్టాత్మక మైలురాయిగా జివా ఆవిష్కరణ నిలుస్తుంది. మా శ్రేణితో టియర్‌ 3, 4,5 మార్కెట్‌ల నుంచి మెరుగైన రాబడిని పొందడంపై దృష్టి కేంద్రీకరించాం. తద్వారా ఈ చిన్న మరియు ఎవరూ అన్వేషించని భూభాగాలలో మా ఉనికిని విస్తరించడంతో పాటుగా మార్కెట్‌ను కైవసం చేసుకోవాలనుకుంటున్నాము. ప్రస్తుత మహమ్మారి, వ్యాపారాలను స్థంభింపజేసింది. అయితే, ఈ ఆవిష్కరణతో మేము మా వృద్ధి ప్రయాణాన్ని మరలా ప్రారంభించగలమని మరియు దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్ధ త్వరగా కోలుకునేందుకు తోడ్పాటునందించగలమని భావిస్తున్నాము.
 
జివా శ్రేణితో ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన కార్యక్రమానికి మద్దతునందించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. అదే సమయంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌కు మద్దతునందించడం ద్వారా భారతదేశంలో తయారీ సామర్థ్యం మరింతగా వృద్ధి చేయడానికీ ప్రయత్నిస్తున్నాం. ఇది బిల్డర్లు, ఆర్కిటెక్ట్స్‌, కాంట్రాక్టర్లతో మా అనుబంధం బలోపేతం చేయడంతో పాటుగా తరువాత తరపు పరిష్కారాలను తొలుతనే ఆస్వాదించే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది. అన్ని ప్రవేశ దశ మరియు ఎకనమీ మాడ్యులర్‌ విభాగపు వినియోగదారుల అవసరాలను తీర్చడాన్ని లక్ష్యంగా చేసుకున్న మేము, అందుబాటు ధరలలో అత్యున్నత శ్రేణి నాణ్యత కలిగిన ఉత్పత్తులను తయారుచేయడానికి కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.
 
ఈ ఆవిష్కరణ గురించి శ్రీ కవామోటో, జాయింట్‌మేనేజింగ్‌ డైరెక్టర్‌, పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘పానాసోనిక్‌ వద్ద, మేమెప్పుడూ కూడా చేసే మంచి పనిని స్థిరంగా చేయడాన్ని నమ్ముతుంటాం. ఈ నమ్మకమే మమ్మల్ని అత్యుత్తమ సౌకర్యం, భద్రత మరియు శ్రేణిలో అత్యున్నత సేవలను అందించేందుకు కట్టుబడేలా నడిపిస్తుంది. ఆరంభం నుంచి కూడా మా అంతర్జాతీయ నైపుణ్యాన్ని భారతదేశానికి తీసుకురావడంతో పాటుగా మా పోర్ట్‌ఫోలియోను సమృద్ధి చేస్తున్నాము. ఈ ఉత్పత్తిలో విస్తృతశ్రేణి ఫీచర్లు ఉంటాయి. ఇవి ఆధునిక గృహ అవసరాలను తీరుస్తూ సంపూర్ణమైన అనుభవాలను దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందిస్తాయి. సాంకేతికంగా అత్యాధునిక పరిష్కారాలతో, అందరికీ ఏకీకృత పరిష్కార బ్రాండ్‌గా నిలువాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.
 
శ్రీ దినేష్‌ అగర్వాల్‌, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘భద్రత, సౌకర్యం మరియు సౌలభ్యం అందించేందుకు ఉత్పత్తులు మరియు పరిష్కారాలను అందించాలనే మా ప్రయత్నాలకు అనుగుణంగా, అందుబాటు ధరలలో జివాను పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ డివైజస్‌లో మార్కెట్‌ అగ్రగామిగా, పలు ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్ ఉపకరణములు ఇప్పుడు ఐఓటీ, ఏఐ ఆధారితమై ఉంటున్నాయని మేము చూస్తున్నాం.
 
యాంకర్‌ మరియు పానాసోనిక్‌ యొక్క సారుప్యతతో, మేమిప్పుడు అధిక సంఖ్యలో ప్రజల జీవితాలను స్పృశించాలనుకుంటున్నాం. తద్వారా మా కనెక్టడ్‌ లివింగ్‌ పరిష్కారాలతో  వినియోగదారుల ఆధునిక సాంకేతిక డిమాండ్స్‌ తీర్చాలనుకుంటున్నాం. ఈ నూతన జివా వైరింగ్‌ ఉకరణముల శ్రేణిని అత్యుత్తమ సౌందర్యం, పొదుపు నమూనాలతో తయారుచేశాము. ఇవి అత్యుత్తమ శ్రేణి నాణ్యతను కలిగి ఉండడంతో పాటుగా మాడ్యులర్‌ విభాగంలో విప్లవాత్మకంగా నిలుస్తాయి’’ అని అన్నారు.