శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జులై 2020 (11:52 IST)

చింగారి కాంటెస్ట్.. రూ.కోటి బహుమతి.. ఆగస్ట్ 25న విజేత ఎవరో?

టిక్ టాక్ నిషేధం తర్వాత ఇండియన్ షార్ట్ వీడియో యాప్ చింగారి యాప్ బాగా పాపులర్ అయ్యింది. టిక్ టాక్ లేకపోవడంతో చింగారి యాప్ డౌన్‌లోడ్స్ బాగా పెరిగిపోయాయి. గంటకు లక్ష డౌన్‌లోడ్స్ రికార్డ్ అవుతున్నాయి. అలాగే గంటకు 2 లక్షల వ్యూస్‌లు వస్తున్నాయి. అతితక్కువ కాలంలోనే ఈ యాప్ డౌన్‌లోడ్స్ కోటి దాటిపోయాయి. 
 
ఇదే జోరును కొనసాగించడానికి కంపెనీ సరికొత్త మార్గంలో ముందుకు వెళ్తోంది. చింగారి స్టార్స్ టాలెంట్‌కా మహా సంగ్రామ్ పేరుతో కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారు ఏకంగా రూ.కోటి గెలుచుకోవచ్చు. బెస్ట్ కంటెంట్ క్రియేటర్లకు రివార్డ్ కింద రూ.కోటి అందజేస్తారు. అంతేకాకుండా ప్రతి రాష్ట్రం నుంచి బెస్ట్ కంటెంట్ క్రియేటర్లకు రూ.5 లక్షలు అందిస్తారు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే వారు 15 నుంచి 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోను అప్‌లోడ్ చేయాలి. మీ వీడియో మీ పర్ఫార్మెన్స్‌తో పాటు లైవ్ ఓటింగ్ కూడా ఉంటుంది. బెస్ట్ కంటెంట్ క్రియేటర్లకు రూ.కోటి అందిస్తారు. ఆగస్ట్ 25న విజేతను ప్రకటిస్తారు.
 
ఈ కాంటెస్ట్ స్టేట్, నేషనల్ అనే రెండు స్టేజ్‌లలో జరుగుతుంది. డాన్స్, పాటలు పాడటం, యాక్టింగ్, మిమిక్రీ, కామెడీ, ఇన్నోవేషన్ అనే కేటగిరిల కింద వీడియోలు చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ కాంటెస్ట్‌లో ఎవరైనా పాల్గొనవచ్చు. దీనిపై చింగారి యాప్ కోఫౌండర్ సుమిత్ ఘోష్ మాట్లాడుతూ.. దేశీ టాలెంట్‌ను వెలికి తీయడం కోసం ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.