సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జులై 2020 (19:44 IST)

మోటారోలా నుంచి మోటో జీ9 ప్లస్ స్మార్ట్‌ ఫోన్..

Moto G9 Plus
మోటారోలా త్వరలో జీ-సిరీస్‌లో మోటో జీ9 ప్లస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఆన్‌లైన్ రిటైల్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.23,700గా నిర్ణయించారు.

ఈ కంపెనీ ఈ మధ్యే మోటొరోటా వన్ విజన్ ప్లస్, మోటో జీ 5జీ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. దీంతో మరో ఫోన్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. 
 
అయితే ఈ ఫోన్ గురించిన సమాచారమేదీ మోటొరోలా తెలపలేదు. మోటో జీ9 ప్లస్ స్మార్ట్ ఫోన్ వేరియంట్లలో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ కూడా ఒకటని తెలుస్తోంది.

అయితే మనదేశంలో ఈ ఫోన్ ఇంతకంటే తక్కువ ధరకే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ లిస్టింగ్‌లో XT2087 మోడల్ నెంబర్‌తో లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్లు కూడా తెలియరాలేదు.