మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (16:20 IST)

రియల్ మి నుంచి కొత్త ఫోన్- వాటర్‌ డ్రాప్‌ స్టైల్‌తో సి11

Realme C11
భారత మార్కెట్లోకి రియల్ మి నుంచి కొత్త ఫోన్ రిలీజైంది. రియల్‌మి సి11 పేరుతో నూతన మోడల్‌ను రియల్ మి ఆవిష్కరించింది. వాటర్‌ డ్రాప్‌ స్టైల్‌తో డిస్‌ప్లేను అద్భుతంగా డిజైన్‌ చేశారు. సీ11 ఫోన్‌లో రివర్స్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది. 
 
పవర్‌ బ్యాంక్‌ తరహాలోనే ఇతర డివైజ్‌లను ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్, డుయెల్ కెమెరాలు ఫోన్‌లోని ప్రత్యేకత. రియల్‌మి సీ 11 కేవలం 2 జీబీ ర్యామ్ ప్లస్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లోనే విడుదలైంది నూతన ఫోన్‌ గ్రీన్‌, గ్రే కలర్లలో అందుబాటులో ఉంది. 
 
జూలై 22 నుంచి ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి డాట్‌కామ్‌ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి సీ1 మోడల్‌ను లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మిలియన్ల మంది సీ సిరీస్‌ ఫోన్లను కొనుగోలు చేశారని రియల్‌మి తెలిపింది.
 
రియల్‌మి సీ11 స్పెసిఫికేషన్లు.:
6.50 అంగుళాల డిస్‌ప్లే
2జీబీ ర్యామ్‌
32జీబీ స్టోరేజ్
5000ఎమ్ఎహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ 10 ఓఎస్
ఫ్రంట్‌ కెమెరా: 5 మెగా పిక్సల్‌
రియర్‌ కెమెరా: 13+2 మెగా పిక్సల్‌
ట్రిపుల్‌ సిమ్‌స్లాట్‌లో భాగంగా డ్యూయల్‌ సిమ్‌+ మైక్రో ఎస్‌డీ కార్డు ఆప్షన్‌ ఉంది. 
భారత్‌లో 2జీబీ ర్యామ్‌ + 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.7,499గా నిర్ణయించారు.