బుధవారం, 10 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2025 (15:37 IST)

Karti: అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది : హీరో కార్తి

Hero Karthi
Hero Karthi
అన్నగారు వస్తారు నాకు ఒక ఛాలెంజింగ్ మూవీ. ఇలాంటి డిఫరెంట్ సినిమాను మీ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తి.  హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ అన్నగారు వస్తారు ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
 
హీరో కార్తి మాట్లాడుతూ -  బాబీ గురించి వంశీ పైడిపల్లి ఎప్పుడూ చెబుతుండేవాడు. వెంకీ కుడుముల ఒక హిలేరియస్ స్క్రిప్ట్ చెప్పాడు. త్వరలో ఆ మూవీ ప్లాన్ చేద్దాం. వివేక్ మంచి రైటర్. ఆయన నేను ఇటీవల కలిశాం. మళ్లీ మీట్ కావాలనుకుంటున్నాం. నా ప్రతి సినిమా రిలీజ్ తర్వాత చిన్మయి నుంచి ఒక పేజ్ మెసేజ్ వస్తుంది. అది రాహుల్ రాసింది. చిన్మయి రాహుల్ మెసేజ్ లు నాకు కొరియర్ లా పంపిస్తుంటుంది. వీళ్లంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు చాలా థ్యాంక్స్. శైలేష్ నాతో హిట్ 3లో చిన్న కేమియా చేయించారు. అందులో నేను చెప్పిన ఒక్క డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఆ చిన్న సీన్ కు చాలా బ్యాక్ స్టోరీ రాశారు శైలేష్. మా కాంబోలో వస్తున్న హిట్ 4 కోసం నేను వెయిట్ చేస్తున్నా. 
 
కృతి శెట్టి నా అభిమాని అని చెప్పింది. ఈ సినిమా కోసం ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేసింది. సెట్ కు వచ్చినప్పటి నుంచి తను ఆ పాత్ర మూడ్ లోనే ఉండిపోయేది. నలన్ కుమారస్వామి స్క్రిప్ట్ చెప్పినప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ను ఊహించలేకపోయాను. ఎలా చేస్తుందని అనుకున్నాను. కానీ కృతి ఆ పాత్రలో ఆకట్టుకునేలా నటించింది. తను మంచి డ్యాన్సర్. నాతో కాస్త స్లోగా డ్యాన్స్ చేయమని చెప్పాను. అన్నగారు వస్తారు సినిమా గురించి చెప్పాలంటే. మనకు మన హీరోలంటే అభిమానం. మీరు నన్ను అభిమానిస్తారు. నేను నాకు ఇష్టమైన హీరోను అభిమానిస్తాను. ఆ అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది. ఈ కాన్సెప్ట్ తో డైరెక్టర్ నలన్ అన్నగారు వస్తారు సినిమాను రూపొందించారు. ఇందాక కృతి చెప్పినట్లు 70, 80 దశకాల్లోని మాస్ కమర్షియల్ సినిమాకు ట్రిబ్యూట్ లా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథకు ఒక సూపర్ హీరో లాంటి హీరో కావాలి. సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ లా ఎందుకు ఉండాలి. మన కల్చర్ లోనే ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ ఉన్నారు. వాళ్లు సినిమాను రాజకీయాలను ప్రజా జీవితాలను మార్చేశారు.
 
 హీరో తెరపై ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం. మనకు మన హీరోలే డెమీ గాడ్స్. వినోదంతో పాటు మనకు ఉపయోగపడే పని వాళ్లు తెరపై చేస్తే అది చాలా స్పెషల్ గా భావిస్తాం. చిన్న స్థాయి నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, ఎంజీఆర్ మనకు సూపర్ హీరోస్. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. నలన్ కుమారస్వామి గారికి తెలుగు దర్శకుల్లో ఇందరు అభిమానులు ఉన్నారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. 
 
ఒక ఊహా ప్రపంచంలో ఈ స్టోరీ జరుగుతుంటుంది. ఇలాంటి గొప్ప పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక సవాల్ లాంటి సినిమా. ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ పాత్రలో నటించాను. ఇలాంటి టఫ్ సినిమాలను చేసినప్పుడే మనం నెక్ట్స్ లెవెల్ కు వెళ్లగలం అనిపించింది. బాగా నటించాననే అనుకుంటున్నా. మీ అందరికీ మా మూవీ నచ్చుతుంది. ఇలాంటి సినిమా మరోసారి చేయడం కష్టం. కొత్తదనం లేని సినిమాలు మీ ముందుకు తీసుకురావాలంటే భయపడతాను. సత్యం సుందరం సినిమా వచ్చినప్పుడు ఆ మూవీని తెలుగు ప్రేక్షకులు, మీడియా ఎంతగా సెలబ్రేట్ చేశారో చూశాను. ఆ క్రమంలో మరో డిఫరెంట్ సినిమాను తీసుకొస్తున్నామని చెప్పగలను. ఇలాంటి కొత్త తరహా చిత్రాలు నా దగ్గరకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. నా తరుపున అన్నయ్య సూర్య తరుపున మీ అందరికీ నా కృతజ్ఞతలు. అన్నారు.