సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (19:37 IST)

'మేడ్ ఇన్ ఇండియా - మేడ్ ఫర్ ఇండియా'... జియో వీడియో కాలింగ్ యాప్ (video)

దేశంలో చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో వీడియో కాలింగ్‌ చేసుకునే వారికి సమస్య తప్పదని భావిస్తూ వచ్చారు. అయితే, రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసింది. 
 
జూమ్ తదితర వీడియో కాలింగ్ యాప్‌లపై విముఖత పెరుగుతున్న వేళ, 'జియో మీట్' పేరిట హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను విడుదల చేసింది. ఇందులో ఇన్వైట్ కోడ్స్ అవసరం లేదని, ఇదే దీని ప్రత్యేకతని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
100 మంది వరకూ ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చని, తమతమ స్క్రీన్స్ షేర్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఈ యాప్ పూర్తిగా ఉచితమని వెల్లడించింది. 
 
లాక్డౌన్ సమయంలో ఇంట్లో నుంచే పని చేసుకోవడానికి, అధికారులు, సిబ్బందితో కలిసుండటానికి, పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు చెప్పుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ యాప్‌ను https://jiomeetpro.jio.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.