ఏడు వారాల్లో జియో ఫ్లాట్‌ఫామ్ లోకి మరో భారీ పెట్టుబడి రూ. 4,546 కోట్లు
జియోలోకి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ఇది ఏడు వారాల్లో (2020 ఏప్రిల్ 22 నుండి) జియో ప్లాట్‌ఫామ్‌లలో అపూర్వమైన 9వ పెట్టుబడి. జియో ప్లాట్‌ఫామ్‌లలో 0.93% వాటా కోసం పెట్టుబడి 4,546.80 కోట్లు
ఈ పెట్టుబడితో, జియో ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ (రెండు పెట్టుబడులు), విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబదాలా, ఎడిఐఎ, మరియు టిపిజిలతో సహా ప్రముఖ టెక్నాలజీ పెట్టుబడిదారుల నుండి రూ. 102,432.15 కోట్లు సేకరించాయి. అలాగే ఎల్ క్యాటర్టన్ రూ. 1,894.50 కోట్లను జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడి పెట్టింది.
ఈ పెట్టుబడులన్నీ గ్లోబల్ లాక్-డౌన్ మధ్య జరిగాయి, ఇది భారతదేశం యొక్క డిజిటల్ సామర్థ్యాన్ని మరియు జియో యొక్క వ్యాపార వ్యూహాన్ని స్పష్టంగా సూచిస్తుంది.