1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Gold rates rises an all time high for corona effect

ఆకాశానికి ఎగిరిపోయిన బంగారం ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు

Gold Rates
బంగారం ధర ఆకాశానికి ఎగిరిపోయింది. తద్వారా బంగారు కొనుగోలు చేయాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధర భగభగమంటూ మెరిసిపోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో పరుగులు పెట్టింది. పసిడి ధరలు అమాంతం పెరిగిపోవడానికి కరోనా వైరస్ ప్రభావమే ప్రధాన కారణం. 
 
కరోనా వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గట్టి పడొచ్చనే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావించే బంగారానికి డిమాండ్ పెరిగింది. 
 
ఈ నేపథ్యంలో పసిడి ధర గ్లోబల్ మార్కెట్‌లో ర్యాలీ చేస్తోంది. దీంతో భారత్‌లో కూడా పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధర పెరుగుతూ రావడం వరుసగా మంగళవారంతో ఆరో రోజు కావడం గమనార్హం. 
 
ఈ కాలంలో పసిడి ధర రూ.2 వేలకు పైగా పెరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఫలితంగా కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొనసాగుతున్న బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ఏకంగా రూ.45 వేలకు చేరుకుంది. కేవలం రెండు నెలల్లోనే రూ.5 వేలు పెరిగి రికార్డు నెలకొల్పింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
భారత్‌‌లో డోనల్డ్ ట్రంప్ పర్యటనపై పాకిస్తాన్ మీడియా ఎలా స్పందించింది?