మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (13:10 IST)

ఓలాలో భారీ నియామకాలు.. 3 నెలల్లో 2వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు

OLA
ఓలా ప్రపంచవ్యాప్తంగా భారీ నియామకాలను చేపట్టనుంది. ఓలా క్యాబ్స్‌కు చెందిన సంస్థ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీలో ముందడుగు వేస్తోంది. ఈ ఏడాది మే నెలలో అమెస్టర్‌డామ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ కంపెనీ ఎటెర్గో బీవీను ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (ఓఈఎం) కొనుగోలు చేసింది. తద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లలో వినియోగించే అధిక శక్తి సాంద్రత కలిగిన బ్యాటరీ టెక్నాలజీకి ఓలా ఎలక్ట్రిక్ కైవసం చేసుకుంది.
 
ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధనలో భాగంగానే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లను నియమించుకుంటామని, ఇతర పాత్రలలో మరో 1,000 మందిని ఎంపిక చేయనున్నామని ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. 
 
గ్లోబల్ మార్కెట్, అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సంస్థ రంగం సిద్ధం చేస్తోందని భవీష్ అగర్వాల్ వెల్లడించారు. ఇందు కోసం త్వరలో అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామన్నారు. ఓలా ఎలక్ట్రిక్‌ను గ్లోబల్ ఇంజనీరింగ్ సంస్థగా మార్చే లక్ష్యంతో సంస్థాగత పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తామని అగర్వాల్  పేర్కొన్నారు.