ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (14:21 IST)

రైలు ప్రయాణీకులకు షాక్.. యూడీఎఫ్ చెల్లించాలట.. ఛార్జీలు పెరుగుతాయట!

రైలు ప్రయాణీకులకు పెద్ద షాక్ తప్పేలా లేదు. కరోనా నేపథ్యంలో రైళ్ల రాకపోకలు ఆగపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో వసూలు చేసినట్టు ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు-యూడీఎఫ్ చెల్లించాల్సి వస్తుందన్న వార్తలొస్తున్నాయి. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో యూజర్ డెవలప్‌మెంట్ ఫీజును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది భారతీయ రైల్వే. 
 
ఆ రైల్వే స్టేషన్లలోకి ఎంటరైతే ఈ ఛార్జీలు చెల్లించక తప్పదు. అయితే ఎంత ఛార్జీలు వసూలు చేస్తారన్న స్పష్టత లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతీయ రైల్వే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. అయితే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రైవేట్ సంస్థల ద్వారా ఆధునిక సదుపాయాలు కల్పిస్తే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు వసూలు చేస్తుంది రైల్వే.
 
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‍షిప్‌లో భాగంగా ఈ ప్రాజెక్టుల్ని రైల్వే చేపట్టనుంది. బిడ్డింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలు ఈ పనులను చేజిక్కించుకుంటారు. ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరించి కమర్షియల్ కాంప్లెక్సులు, యూజర్ ఫీజుల ద్వారా లాభాలు పొందుతారు. అలాగే ప్రైవేట్ సంస్థలు ఆధునీకరించే రైల్వే స్టేషన్లలో కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజుల్ని రైలు ప్రయాణికులు చెల్లించక తప్పదు.