శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (10:11 IST)

తమిళనాడులో 5,994 మందికి కరోనా లక్షణాలు.. చెన్నైలో 989 కేసులు

తమిళనాడులో ఆదివారం 5,994 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,96,901కి చేరింది. రాజధాని చెన్నైలో 989 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,09,117కు పెరిగింది. 
 
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న బాధితులలో 119 మంది మరణించగా, మృతుల సంఖ్య 4,927కు పెరిగింది. ఇక కరోనా నుంచి కోలుకుని ఆదివారం 6,020 మంది డిశ్చార్జి కావటంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,38,638కు చేరింది.
 
అలాగే దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా కేసులు నమోదవవుతున్నాయి. అయితే కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉండటం ఊరట కలిగిస్తోంది. దేశంలో 15 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
 
భారీ సంఖ్యలో చేపడుతున్న పరీక్షలు, అత్యుత్తమ వైద్య సేవలు తదితర చర్యల ద్వారా ఆశించిన ఫలితాలు వస్తున్నాయని పేర్కొంది. దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య.. ప్రస్తుతం ఉన్న యాక్టీవ్‌ కేసుల సంఖ్య కంటే రెట్టింపుగా ఉందని వెల్లడించింది. అలాగే దేశంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం పది రాష్ట్రాల నుంచే ఉన్నాయని పేర్కొంది.