శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (12:13 IST)

ప్రైవేట్ ఆస్పత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ సర్కారు

తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రైవేట్ ఆస్పత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే కరోనా వైద్యానికి అధిక ఫీజులను వసూలు చేస్తున్న కొన్ని ఆస్పత్రులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రులు వేధిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌లు మాత్ర‌మే చికిత్స‌కు తీసుకోవాల‌ని పేర్కొంది.  
 
అధిక ఛార్జీలు వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈటెల హెచ్చరించారు. ఫీజుల వివ‌రాల‌ను ఆస్ప‌త్రిలో కీల‌క ప్ర‌దేశాల్లో ప్ర‌ద‌ర్శించాల‌ని తెలంగాణ ఆదేశించింది. కరోనా వైద్యానికి ఉపయోగించే పీపీఈ కిట్ల ధరలు సైతం ప్రభుత్వం నిర్దారించిన ప్రకారమే అమ్మాలని తెలిపింది. 
 
పేషంట్లను ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ చేసేటప్పుడు పూర్తి వివరాలతో కూడిన బిల్లును ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆస్పత్రులు నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.