ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (10:23 IST)

బంగాళాఖాతంలో మరో అల్పప్రీడన ద్రోణి.. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పప్రీడన ద్రోణి ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌పై కొనసాగుతున్న అల్పపీడనం బలపడటం, తమిళనాడు తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు, దక్షిణ చత్తీస్ గఢ్ పై మరో ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడనుందని, దీంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
 
మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములతో, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బుధ, గురు వారాల్లో కూడా చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం కోస్తా ప్రాంతంపై బాగా ఉంటుందని అంటున్నారు అధికారులు. దీంతో రానున్న 2 రోజులు తెలుగు రాష్ట్రాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తుంది.
 
ఇవాళ రేపు ఆదిలాబాద్‌, నిర్మల్, కొమురభీం ఆసిఫాబాద్ మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. 
 
ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.